మాజీ విశ్వ సుందరి,బాలీవుడ్ నటి సుస్మిత సేన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఆమె చాలాసార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు. 50వ పడికి దగ్గర పడుతున్న ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. పైగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. దానికి కారణం ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.
బాలీవుడ్ నటికి, ఐపీఎల్ మాజీ చైర్మన్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదివేయండి.
లలిత్ మోడీ,సుస్మితా సేన్ ఇద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని లలిత్ మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్త ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సుస్మితాతో డేటింగ్ లో ఉన్నట్లు ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. నా బెటర్ హాఫ్‌తో కొత్త జీవితం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
కొంత కాలం క్రితం వరకు సుస్మితా రొమన్ షాల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం.వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సమయంలో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న చిత్రాలు చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వయసులో చిన్నవాడితో డేటింగ్ ఏంటని అప్పట్లో సోషల్ మీడియాలో సుస్మితా విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్లు తెలిపినప్పటికీ…పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదని లలిత్ మరో పోస్ట్ లో క్లారిటీ ఇచ్చాడు. అయితే అది కూడా త్వరలో జరుగుతుందేమో అని పేర్కొన్నాడు.
దీంతో సుస్మిత సేన్, లలిత్ మోడీ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇది నిజమా అంటూ చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. ఇంకొందరు లేటు వయసులో ఘాటు ప్రేమ ఏంట్రా బాబు అంటూ షాక్ అవుతున్నారు.
మరికొందరేమో ఏకంగా విశ్వసుందరినే లైన్ లో పెట్టాడు అంటే వాడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ పోస్టులు పెడుతున్నారు.
1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ గా విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సుస్మిత హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ లు చేస్తోంది.
Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
Advertisements