నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీని అధికారులు గుర్తించారు. సన్సోవారా ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమానం నుంచి 14 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు వివరించారు.
మంచు కురుస్తున్న కారణంగా విమానం గాలింపు చర్యలను ఆదివారం అధికారులు నిలిపివేశారు. ఆ తర్వాత సోమవారం ఉదయం గాలింపు చర్యలను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఘటనా ప్రదేశంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వివరించారు.
మృత దేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కొన్ని మృతదేహాలను గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉందని వివరించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖట్మండుకు తరలిస్తున్నట్టు చెప్పారు.
నేపాల్ తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆదివారం గల్లంతైంది. ఈ విమానంలో సుమారు 21 మంది ప్రయాణీకులు ఉన్నారు. గల్లంతైన వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.