దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ… అందరి దృష్టి ఉన్న రాష్ట్రం మాత్రం బెంగాల్. ఇక్కడ దీదీ వర్సెస్ మోడీ అన్నట్లుగా రాజకీయం సాగుతుంది. 8దశల్లో ఎన్నికలు జరగనుండగా, బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వాన్ని గద్దెదింపి… మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిందంటే నందిగ్రామ్ కీలకం. భూసేకరణ పోరులో వామపక్ష ప్రభుత్వం కొట్టుకపోయింది. మమతా బెనర్జీకి అక్కడ కుడిభుజంగా సువేందు అధికారి ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో సువేందు అధికారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనే సీఎం అభ్యర్థి అన్నది ఓపెన్ టాక్.
నందిగ్రామ్ అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ మమతపై సువేందు పోటీ చేయనున్నారు. మమతపై పోటీ చేయటమే కాదు 50వేల మెజార్టీతో గెలుస్తానని సువేందు ప్రకటించగా… బీజేపీ సీఈసీ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
మమతా నందిగ్రామ్ తో పాటు భవానీపూర్ నుండి కూడా బరిలో ఉండనున్నారు.