సువేరా
గతంలో కరోనా వ్యాప్తి విషయంలో అన్యాయంగా అనేకమంది హిందువులు మోడీ భక్తులు అరెస్సెస్ వాళ్ళు మతమౌడ్యులు ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ ఇస్లామ్ నిర్వాహకులను, దేశంలోని ముస్లీములను కరోనా వ్యాప్తికి ముఖ్యకారకులు అంటూ నేరస్తులుగా దోషులుగా చిత్రీకరించి అవమానించాము వేధించాము కదా..?నేడు…తిరుమలలో 743 మంది అర్చకులకు సిబ్బందికి, విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయం, శ్రీశైలం శ్రీకాళహస్తి లాంటి అనేక దేవాలయాలు మరియు ఇతర అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అనేక ఇతర హైందవ దేవాలయాల్లో కూడా అనేకమంది అర్చకులకు సిబ్బందికి అదే కరోనా సోకింది, కొందరు చనిపోతున్నారు కూడా.
గతంలో ఢిల్లీ తబ్లీగీ జమాత్ విషయంలో ఏదైతే ప్రభుత్వం అనుసరించిందో, ఎలాగైతే తబ్లీగీ జమాత్ ఇస్లాం నిర్వాహకులు మీద హత్యాయత్నం హత్య కేసులు పెట్టారో అదే న్యాయసూత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వ్యాప్తికేంద్రాలుగా మారుతున్నటువంటిహిందూదేవాలయాలకు, వాటి నిర్వాహకులకు, అక్కడకు వెళుతున్న భక్తులకు కూడా వర్తింపచేయాలి కదా..? అలాగే, దేశవ్యాప్తంగా చర్చీలలో ఉన్నటువంటి ఫాదర్లు పాస్టర్లు భక్తుల మీద కూడా అదేవిధమైన కేసులు పెట్టాలికదా..?న్యాయం ధర్మం అందరికీ ఒక్కటేకదా..! వారిద్వారా దేశంలో అనేకమందికి నాయకులకు యువకులకు ఉద్యోగులకు అమాయకులకు పిల్లలకు వృద్ధులకు కరోనా వ్యాధి సోకుతోంది కదా…కేంద్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలరా ?