బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. వరుసగా పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో పెడుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా కర్ణాటక, నైజాం, ఆంధ్ర సీడెడ్ హక్కులను యు.వి.క్రియేషన్స్ కు అందించాడట. అందుకు 75 కోట్ల రూపాయలు రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో ఎంత మార్కెట్ చేసినా 50 కోట్ల మేర మిగులుతాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.