మరదలు మనోభావాలు దెబ్బతీసిందని అలిగి వీరసింహారెడ్డి మూవీలో స్టెప్పులేసిన బాలయ్య.. ఏఎన్నార్, ఎస్వీఆర్ లను కించపరచి వారి అభిమానుల మనోభావాలు దెబ్బతీసారని విమర్శలు చెలరేగాయి. వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో అక్కినేని తొక్కినేని, ఆ రంగారావు ఈ రంగారావు అని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగింది.
అయితే.. బాలయ్య వ్యాఖ్యలపై ఇప్పటికే ఏఎన్నార్ మనవళ్లు స్పందించగా.. తాజాగా ఎస్వీఆర్ మనవళ్లు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ సభలో ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమానించారంటూ వస్తున్న వార్తలపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలకృష్ణ మాటల్లో తమకు ఎలాంటి వివాదమూ కనిపించలేదని తేల్చారు. ఆయనతో తమకు మంచి సంబంధం ఉందని, కాబట్టి దీన్ని ఇంకా సాగదీసి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పాడు చేయొద్దని కోరారు.
వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయని అన్నారు. ఆయనతో తమకు మంచి అనుబంధం ఉందని, తాము ఒకే కుటుంబంలా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారని అన్నారు.
ఈ విషయంలో తమకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని అన్నారు. అనవసరంగా దీన్ని సాగదీసి, తమకు, ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దని కోరారు ఎస్వీఆర్ మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు, ఎస్‌వీఎల్ఎస్ రంగారావు.