ప్రముఖ కన్నడ నటి కిషోరి బల్లాల్ కన్ను మూశారు. దాదాపు 75 సినిమాల్లో నటించిన ఆమె 2004 లో హిందీలో ‘స్వదేశ్’ సినిమాలో చెరిగిపోని ముద్ర వేశారు. 82 ఏళ్ల బల్లాల్ వయసు సంబంధిత వ్యాధులతో మరణించినట్టు బెంగళూరులోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1960 లో ‘ఇవలెంత హెందతి’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన బల్లాల్ ఐదు దశాబ్ధాలు సినీ రంగంలో పలు సినిమాల్లో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ భాషల్లో 75 సినిమాల్లో నటించారు.
బాలీవుడ్ లో అశుతోష్ గౌరికర్ ‘స్వదేశ్’ ఫిల్మ్ లో షారూఖ్ తల్లి పాత్రలో కావేరి అమ్మగా అందరినీ ఆకట్టుకుంది. రాణీ ముఖర్జీ ‘ఆయియా’, దీపికా పడుకొనే లఫంగే పరిందే సినిమాల్లోనూ నటించారు. భరతనాట్యం డ్యాన్సర్ శ్రీపతి బల్లాల్ ను పెళ్లి చేసుకున్నారు. కిషోరి బల్లాల్ మరణ వార్త తెలియగానే అశుతోష్ గౌరికర్ ట్విట్టర్ లో సంతాప సందేశం పంపారు ”కిషోరి జీ…మీ మంచితనం…ఎప్పటికీ గుర్తుంటుంది…స్వదేశ్ లో కావేరి అమ్మగా మీ పాత్ర మర్చిపోలేనిది…నిజంగా మిమ్మల్ని కోల్పోయినందుకు ఎంతో చింతిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.