టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు స్వేరో సభ్యుడొకరు ఝలక్ ఇచ్చాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై విమర్శలుచేస్తే బాగుండదని ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు. ప్రవీణ్ కుమార్‌ను విమర్శించే స్థాయి నీదా అంటూ ప్రశ్నించాడు. ఒకే సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి ఊరుకుంటున్నా.. లేదంటే వేరే ఉండేదని బెదిరించాడు. అందుకు కిషోర్ లేదంటే ఏం చేస్తావని ప్రశ్నించగా.. నిన్నేం చేస్తా.. ఇప్పటికే భయపడుతున్నావు అంటూ స్వేరో సభ్యుడు పరిహాసమాడాడు.
వందలాది కేసులున్నయి నామీద.. జైలుకు కూడా వెళ్లొచ్చినా.. బెదిరింపులు బంజెయ్.. ఫోన్ పెట్టేయ్ అంటూ గ్యాదరి కిషోర్ ఫోన్ చేసిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేశారు. అయినా అతడు మాట్లాడుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో గ్యాదరిని ఆ వ్యక్తి తమ్ముడూ.. అంటూ సంబోధించగా.. ఎవడ్రా నీకు తమ్ముడు అంటూ గ్యాదరి ఫైర్ అయ్యారు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందాని.. గ్యాదరి కిషోర్‌ను ఆ వ్యక్తి ప్రశ్నించాడు. ప్రవీణ్ కుమార్ ఇలా దాడులు చేయమని నేర్పిస్తున్నారా.. పోలీస్ కేసు పెడతానని గ్యాదరి హెచ్చరించగా.. పెట్టుకో అంటూ ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అబ్బా.. పోలీసు కేసు అంటే అంత చులకనా అంటూ గ్యాదరి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని విన్నవారంతా కొందరు ఫన్నీగా ఉందంటూ కామెంట్ చేస్తోంటే.. లెక్కకు లెక్క సరిపోయింది అని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు.
ఆ ఆడియో ఇదే..
అంతకు ముందు ఏమైందంటే..
ఇటీవల బీఎస్పీలో చేరుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దానికి కౌంటర్‌గా ఎమ్మెల్యే గ్యాదరి సహా టీఆర్ఎస్ నేతలు ప్రవీణ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌పై మాట జారితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రవీణ్ కోటు వేసుకుని అంబేద్కర్‌లా ఫీల్ అవుతున్నారని, ఆయన బీజేపీ తీసుకొచ్చిన లీడర్ అంటూ విమర్శించారు. దీంతో గ్యాదరి వ్యాఖ్యలకు కౌంటర్‌గా స్వేరోస్ సభ్యుడు ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు