స్వామి అవిముక్తేశ్వరా నంద్ ను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు చేసేందుకు బయలు దేరుతుండగా ఆయన్ని పోలీసులు అడ్డుకుని శ్రీ విద్యామఠ్ లో నిర్బందించారు.
జ్ఞానవాపి మసీదులో శివలింగానికి తన సహచరులతో కలిసి శనివారం పూజలు చేస్తానని ఆయన అంతకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆశ్రమం సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు.
దీనిపై అవిముక్తేశ్వరా నంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగానికి పూజలు చేసేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. తనకు అనుమతి ఇచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.
జ్ఞానవాపి మందీర్ వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో రోజుకో కొత్త వివాదాన్ని తెరపైకి తేవాల్సిన పని లేదని తెలిపారు.