లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఎక్కడున్నారు అన్నది ఇంకా అంతుచిక్కటం లేదు. నేపాల్ మీదుగా దేశం దాటి పారిపోయారని గుజరాత్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిత్యానంద పరారీలో ఉన్నా… ఆయన ప్రవచనాలు మాత్రం ఆగటం లేదు. దీంతో నిత్యానంద ఇండియాలో లేకున్నా… అతని ప్రవచనాలు ఎలా వస్తున్నాయి, కొత్తవా.. పాతవా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
కర్ణాటకలో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇప్పటికే వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులలో నిత్యానంద వాయిదాలకు హజరుకావటం లేదు. పైగా చిన్నారులను హింసిస్తున్నారనే ఆరోపణలతో అహ్మదాబాద్ ఆశ్రమం నుండి ఇటీవలే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే నిత్యానంద జాడ మాత్రం అక్కడా కనపడలేదు.
పైగా… ఆయన విదేశాలకు నేరుగా వెళ్లేందుకు అవకాశమే లేదని, నిత్యానంద పాస్‌పోర్టు 2018లో గడువు ముగిసినా.. రెన్యూవల్‌కు దరఖాస్తు కూడా చేసుకోలేదని వార్తలు వస్తున్నాయి.