కరీంనగర్: హిందుగాళ్ళు… బొందుగాళ్ళు అన్న కేసీఆర్.. హిందువా లేక రజాకారా? అని స్వామీ పరిపూర్ణానంద ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లికి బీజేపీ నేతలు బండి సంజయ్ స్వామి పరిపూర్ణానంద, రాపోలు ఆనంద భాస్కర్ వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. ‘సాధారణ ప్రజలు తూటాలకు మరణిస్తే నయా నిజాం కోటలో బతుకుతున్నారు. తెలంగాణ అంతా తిరుగుతా.. అమరవీరుల ఇంటికి వెళ్తా… నాకు ప్రధాని పదవి వడ్లగింజతో సమానం అని స్వామీ పరిపూర్ణానంద అన్నారు. నేను యదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానంటే తనను రాష్ట్రం నుంచి బహిష్కరించిన కేసీఆర్‌ను సంవత్సరం తిరగకముందే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి బొమ్మలను బహిష్కరించారని పరిపూర్ణానంద పేర్కొన్నారు.
బైరాన్‌పల్లి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని ఇదే సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నీచచరిత్రను సమాధి చేసి నిజమైన చరిత్రను లిఖిస్తామన్నారు. 2024లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.