ఒకప్పుడు నిర్మాణ రంగాల్లో ఎక్కువగా మగవారిని చూస్తుండే వాళ్లం. ఆడవాళ్లు కూడా ఉండేవాళ్లు కానీ ఎక్కడో చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆడవారు కూడా నిర్మాణ రంగాల్లోకి దూసుకొస్తున్నాడు. హీరోయిన్స్ సైతం సొంత ప్రొడక్షన్ హౌస్ లను పెట్టుకుంటూ సినిమాలు నిర్మించే రోజులు వచ్చేశాయి. ఇక కొంతమంది నిర్మాతల కుమార్తెలు కూడా తండ్రి వారసత్వంతో నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగులో స్వప్నాదత్ కూడా నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వప్నదత్ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. అర్జున్ రెడ్డి కథ నాకు ఎంతగానో నచ్చింది.. ఆసినిమా తీయాలనుకున్నా అయితే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయలేకపోయా.
ఒకవేళ సినిమా అటూఇటూ అయితే ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా? అని విమర్శిస్తారని భయపడ్డా అని తెలిపారు. కెరియర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. ఓ చానల్‌ను ప్రారంభించి విఫలమయ్య.. తాము మళ్లీ కమ్‌బ్యాక్ కాగలిగామంటే అందుకు ప్రేక్షకులే కారణమని అన్నారు. సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి కూడా తెలిసిందే కదా. తమిళ్ లో విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా నటించగా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. రెండు భాషల్లోనూ సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.
కాగా స్వప్న దత్ ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. 2005లో సుభాష్ చంద్రబోస్ అనే సినిమాతో నిర్మాతగా మారిన స్వప్న దత్ చాలాకాలం ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకుని మళ్లీ 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఇక 2018లో మహానటి 2022లో సీతారామం సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.