హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఆ ట్రోల్స్ పై స్పందిస్తూ ఉంటారు. మరి కొంతమంది లైట్ తీసుకుంటూ ఉంటారు. కాగా ఇటీవల స్వరా భాస్కర్ కరోనా బారిన పడ్డాను అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు నెటిజన్స్. ఆర్ ఐ పి అంటూ పోస్ట్ లు పెట్టారు.
వాటి పై స్వరా భాస్కర్ స్పందించింది. కొత్త సంవత్సరం 2022 లో విన్న అత్యుత్తమ వార్తలలో ఇది మొదటిది అంటూ ట్వీట్ చేసింది.నా మరణం కోసం ప్రార్థిస్తున్న నా ప్రియమైన నఫ్రతీ చింటూస్ ట్రోలర్స్ కు.. దోస్టన్ అప్నీ భావన్ నాయీం కాబూ మే రఖో..మఝే కుచ్ హో గయా తో ఆప్కీ రోజీ రోటీ చిన్ జాయేగీ..ఘర్ కైసే చలేగా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.