ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో పుస్తకం రాసి చర్చనీయాంశమైన బాలీవుడ్ నటి కరీనా కపూర్.. పిల్లలను కనే సమయంలో తనకు ఎదురైన ఆసక్తికరమైన విషయాలను అందులో పంచుకుంది. ఈక్రమంలో తన పెద్ద కూమరుడు తైమూర్ పుట్టిన సమయంలో ఎలాంటి కష్టాన్ని అనుభవించింది ఓ చోట వివరించగా.. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తైమూరు డెలీవరి సమయానికంటే ముందే జన్మించాడని.. అందుకోసం అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్న కరీనా.. ఆ టైమ్‌లో ఆ చిన్నారికి 14 రోజులపాటు చనుబాల కూడా ఇవ్వలేదని తెలిపింది. తన తల్లి, నర్సు పక్కనే ఉండి.. పాలు ఎందుకు రావడం లేదో తేలియక తికమకపడ్డారని వివరించింది. పైగా అలాగే ఒకరోజు తర్వాతే తన చిన్నారిని చూసుకోవడం తనను చాలా బాధించిందని రాసుకొచ్చింది.
రెండో కొడుకు జెహ్ పుట్టినప్పుడు మాత్రం ఎలాండి ఇబ్బంది ఎదురుకాలేదని.. తొందగానే చనుబాలు పట్టగలిగాని కరీనా పుస్తకంలో వివరించింది. తైమూరు పుట్టినప్పుడు మాతృత్వాన్ని సరిగా ఆస్వాదించలేకపోయాయని.. అందుకే తొందరగానే రెండో సంతానాన్ని కన్నట్టు చెప్పుకొచ్చింది.