వైసీపీకి అమరావతి అంటే ముందు నుండి పడదు. కానీ గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించి, స్వయంగా ప్రధాని మోడీ చేతులతో ప్రారంభించి… కాస్తో కూస్తో అభివృద్ధి చేశాక తర్వాతి ప్రభుత్వాలేవయినా రాజధానిని మార్చే ఆలోచన చేయవు. కానీ వైసీపీ సడన్‌గా రాజధానిని మార్చలన్నా ఆలోచన ఎందుకు చేసింది…? కేవలం టీడీపీని ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహమేనా…? అమరావతిలో టీడీపీ నేతలు వేల ఎకరాలు కొన్నారు అని ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు విశాఖలో వైసీపీ నేతలు అదే పని చేశారా…? ఇలా రకరకాల ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. అయితే… ఇవన్నీ నాణేంకు ఒకవైపేనని, అసలు విషయం జగన్ ఎంతో ప్రేమించే సాములోరని తెలుస్తోంది.
అవును… రాజధాని మార్పు వెనుక విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపానదేంద్ర స్వామి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఎక్కువ కాలం అధికారంలో ఉండాలన్నా, ఏపీ ముఖ చిత్రాన్ని… భౌగోళిక ప్రాంతాన్ని బట్టి చూస్తే… అమరావతి వాస్తు పరంగా జగన్‌కు అచ్చిరాదని, విశాఖకు మార్చితే భవిష్యత్ బ్రహ్మండంగా ఉంటుందని స్వరూపానదేంద్ర సరస్వతి చెప్పటంతోనే జగన్ కొత్త రాజధాని ఫార్మూలా తెరపైకి తెచ్చారని టాక్ నడుస్తోంది.
అంతేకాదు రాజధాని మార్పు సమయంలో మరోసారి కర్నూల్ ప్రతిపాదన ఎలాగూ తెరపైకి వస్తుంది కాబట్టి రాయలసీమ వాసిగా హైకోర్టు బెంచ్ ఇస్తే తనకు మంచి మైలేజ్ కూడా వస్తుందని… పైగా మూడు రాజధానుల మాటతో టీడీపీ ఇరకాటంలో పడుతుందని భావించిన వైసీపీ అధినేత రాజధాని మార్పు అనే ఒక్క అంశంతో మూడు ప్రయోజనాలను ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది..