పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. రాసిపెట్టి ఉంటే ఖండాలు దాటివచ్చి కూడా కనెక్ట్ అవుతారు. ఫేస్ బుక్ లో ఫ్రెండై ,ఆ పరిచయం ప్రేమై.. నేడు ఉత్తర్ ప్రదేశ్ యువకుడి భార్యైన ఓ స్వీడన్ యువతి ప్రేమకథ ఇప్పుడు సామాజిక మాధ్యామాల్లో చక్కెర్లు కొడుతుంది. కొంచెం క్రేజీగానే ఉంది కదూ.. తప్పదు.
కల్పితం కాదు, నిజం. ప్రేమ సాధించిన విజయం. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన పవన్ కుమార్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్ తో 2012లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత పదేళ్లుగా మొబైల్ ఫోన్‌లో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా ప్రేమాయణం సాగించారు. గత ఏడాది ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు.ఈ సందర్భంగా పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. కాగా, క్రిస్టేన్ ఇటీవల స్విడన్ నుంచి భారత్‌కు వచ్చింది.
ఉత్తరప్రదేశ్ అవగఢ్‌లోని ఒక స్కూల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పవన్ కుమార్‌తో ఆమె పెళ్లి జరిగింది. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ దేశానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని క్రిస్టేన్ తెలిపింది. మరోవైపు తమ కుమారుడికి విదేశీ మహిళతో పెళ్లి జరుగడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వరుడు తండ్రి గీతమ్ సింగ్ తెలిపారు.
తమ పిల్లల సంతోషమే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. కాగా, డెహ్రాడూన్‌లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఒక సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్వీడన్ మహిళతో అతడి పెళ్లి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Swedish Woman Flies To India To Marry Facebook Friend In UP https://t.co/9zZDZNGdCy pic.twitter.com/GTPpU2uv2X
— NDTV (@ndtv) January 29, 2023