కొత్త బంగారులోకం సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమా అప్పట్లో థియేటర్స్ లో సంచలనమే సృష్టించింది. అయితే ఆ తర్వాత రైడ్ కళావర్ కింగ్, కాస్కో వంటి చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వ్యభిచార ఆరోపణలు రావటంతో మరికొన్ని అవకాశాలు రాకుండా పోయాయి. ఇక అక్కడి నుంచీ కొన్ని కొన్ని ఐటమ్స్ సాంగ్స్ లో కనిపించినప్పటికీ పెద్దగా లాభంలేకపోయింది.
దీంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ ను వివాహం చేసుకుని ఆ తర్వాత అతనితో కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తూ ఛాన్స్ దక్కించుకుంది. ఇండియా లాక్ డౌన్ అనే సినిమాలో సెక్స్ వర్కర్ పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ నటించనుంది. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ముంబై రెడ్ లైట్ ఏరియా లో చాలా మంది చాలా ఇబ్బందులను ఫేస్ చేశారట. వారి సమస్యలు తెలుసుకోవాలని శ్వేతాబసుప్రసాద్ రెడ్ లైట్ ఏరియా కి వెళ్ళిందట. నేను, మధు సర్, నా టీమ్.. రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడి వారి యాసను బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. అక్కడికి వెళ్లడం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అంటూ ఆమె తెలిపింది.