లాక్ డౌన్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. హైదరాబాద్, వైజాగ్ సహా దేశంలోని చాలా నగరాల్లో మెజారిటీ హోటల్స్ మూసివేయబడ్డాయి.చాలా చోట్ల ఫుడ్ డెలివరీ బాయ్స్ పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజలు కూడా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇంటి ఫుడ్ కే ప్రాధాన్యత ఇచ్చారు.ఆఫీస్ లు కూడా లేకపోవడంతో కుటుంబంతో సహా వెరైటీ వంటకాలతో ఎంజాయ్ చేస్తున్నారు. స్విగ్గి, జోమాటొ జోలికి వెళ్ళడానికి ఎవరు సాహసించలేదు.
దేశంలో మార్చి మొదటి రెండు వారాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో 20శాతం తగ్గుదల కనిపించింది.జోమాటో మరియు స్విగ్గీ కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్లు గత 10 రోజుల్లో 70% పడిపోయి రోజుకు 1 మిలియన్ డెలివరీకి పడిపోయాయి. కరోనా రాక ముందు రోజుకు 2.5 మిలియన్ల డెలివరీల స్థిరమైన స్థితి నుండి, ఈ రోజు మనం 1 మిలియన్ ఆర్డర్‌ల వద్ద ఉన్నామని, జస్ట్ ఇప్పుడే స్వల్పంగా పెరుగుతున్నాయని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లు చెబుతున్నాయి.