ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో ఏంటో తెలుసా..? ఓ స్వీగ్గీ డెలివరీ బాయ్ జోరు వానలో తన కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రంపై వెళ్తున్నాడు. అది వీడియో తీసిన ఓ సిటీజన్ సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే అది పెట్టిన కొద్ది క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అసలు దీని కథేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి..
ముంబయిని గత కొద్దిరోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆ సమయంలో స్విగ్గీకి ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. దానిని తీసుకుని వెళ్లడానికి స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని ఉపయోగించాడు. ఓ వైపు ఫుల్ గా వాన పడుతోంది. మరోవైపు ట్రాఫిక్ జామ్. దీంతో మన డెలివరీ బాయ్ చక్కగా గుర్రం మీద సమయానికి వెళ్లిపోయి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశాడు. దీనిని వీడియో తీసి నెట్లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
అయితే అసలు ట్వీస్ట్ ఏంటంటే.. అసలు ఆ డెలివరీ బాయ్ ఎవరు అనేది ఎవరికి తెలియడం లేదు. ఆఖరికి స్విగ్గీ కంపెనీకి కూడా.. ఆ డెలివరీ బాయ్ ఎవరో కంపెనీ వెల్లడిస్తుందనుకుంటే.. తానే ఆ ఎగ్జిక్యూటివ్ కోసం వెతుకుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక ఆ ఎగ్జిక్యూటివ్ ఎవరో చెబితే రూ.5 వేల నగదును బహుమతిగా కూడా ఇస్తానంటూ చెబుతోంది.
ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వల్ల స్విగ్గీ బ్రాండ్‌కు అనూహ్యమైన ఫేమ్ వచ్చింది. మిగతా నెటిజన్ల మాదిరిగానే తాము కూడా ఇతనెవరో కనిపెట్టలేకపోతున్నామని, ఈ యంగ్ స్టార్ ఎవరబ్బా..? ఈయన తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం అంటూ స్విగ్గీ ట్విటర్‌లో ప్రకటించింది. ‘అనుకోనిది, కానీ మెచ్చకోని ఫేమ్ కాదు’ అంటూ స్విగ్గీ పేర్కొంది.
ఈ యాక్సిడెంటల్ బ్రాండ్ అంబాసిడర్లకు తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పేందుకు తాము కూడా ఈ వెతుకులాట ప్రారంభించామని స్విగ్గీ తెలిపింది. ఈ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎవరూ తెలుసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేసిన తర్వాత.. స్విగ్గీ ప్రజలకే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కనుగొనే బాధ్యతను అప్పజెప్పింది. ఈ డెలివరీ బాయ్‌ని గుర్తించిన వారికి రూ.5 వేల రివార్డును కూడా అందించనున్నట్టు పేర్కొంది.
Yeh @Swiggy walo ne go green bohot seriously le liya. pic.twitter.com/YYQtvmfcj7
— Vinay Mhatre (@IndianKopite) July 3, 2022
Advertisements