ఇండియన్స్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటీ వెంటనే బిర్యానీ అనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఆకలేస్తుందంటే చాలు బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అంటుంది. అయితే, కరోనా వైరస్ సమయంలోనూ ఇండియన్స్ ఇంట్లో నుండి బిర్యానీ కోసం ఆర్డర్ చేశారట.
స్విగ్గి గణంకాల ప్రకారం… ప్రతి సెకనుకు ఒక బిర్యానీ ఆర్డర్ వస్తుందట. 2020 సంవత్సరంలో ఎక్కువగ ఆర్డర్ చేసిన ఐటమ్ బిర్యానీ. అందులోనూ చికెన్ బిర్యానీ. స్విగ్గిలో కొత్త వచ్చిన 3లక్షల మంది యూజర్లలో ఎక్కువ మంది చికెన్ బిర్యానీ కావాలని ఆర్డర్ చేసినట్లు తెలిపింది.
జనవరి నుంచి మార్చి నెల వరకు ఆఫీస్ నుంచి ఆర్డర్లు చేసేవారి కంటే ఇళ్ల నుంచి ఆర్డర్ చేసినవారి సంఖ్య ఐదు రెట్లు ఎక్కువయ్యాయని, ఏప్రిల్ నుంచి మే నెలలో ఆ సంఖ్య 9 రెట్లు ఎక్కువైందని పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి కూడా జనం బిర్యానీ కోసం ఆరాటపడ్డారని అర్థం చేసుకోవచ్చు. కరోనా భయం ఉన్నా సరే జనం బిర్యానీ కోసం ఆరాటపడ్డారు.