తమ కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ ఖర్చు భరిస్తామన్న కంపెనీల జాబితా పెరుగుతోంది. తాజాగా ఆ లిస్ట్ లో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ స్విగ్గీ కూడా చేరింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు, ఫుడ్ డెలివరీలో భాగమవుతున్న వారందరికీ అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని, తమ 2లక్షల భాగస్వాములకు కరోనా వ్యాక్సిన్ ఖర్చు భరిస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి జరిగే 45సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ క్యాంపులో భాగంగా స్విగ్గీ భాగస్వాములుగా ఉన్న 5500మందికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగానే… తమ సేవలు కొనసాగుతాయని, వీలైనంత తక్కువగా ఫుడ్ డెలివరీ బాయ్స్ తో ఆర్డర్ చేసిన వారికి కాంటాక్ట్ లేకుండా సేవలు అందించేలా కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు స్విగ్గీ ప్రకటించింది.