అందుకే సైరా కలెక్షన్లు పడిపోయాయా...? - Tolivelugu

అందుకే సైరా కలెక్షన్లు పడిపోయాయా…?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నెమ్మదిస్తోంది. కలెక్షన్ల పరంగా తెలుగులో సూపర్ హిట్ అయినప్పటికీ… ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ అన్న టాక్ తెచ్చుకుంది.

తెలుగులో 100కోట్ల క్లబ్‌లో చేరినా, బ్రేక్ ఈవెన్‌ను మాత్రం చేరుకోనట్లు తెలుస్తోంది. సినిమా విడుదలై 15రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ సినిమాకు ప్రోమోషన్‌ నడుస్తున్నా… తెలుగు రాష్ట్రాల్లో 104కోట్లు కలెక్ట్‌ చేసింది. వరల్డ్‌వైడ్‌గా 139కోట్లతో ఆగిపోయింది. మహ అయితే, 150కోట్లకు మించదని సినిమా యూనిట్‌ కూడా అంచనా వేస్తోంది.

ఓవరాల్‌గా చిరుకు మంచి సినిమానే అయినా… ఇతర భాషల్లో కలెక్షన్లు కొల్లగొట్టడంలో విఫలం కావటం సైరా కలెక్షన్ల గ్రాఫ్‌ డౌన్‌ కావడానికి కారణమని సమాచారం.

Share on facebook
Share on twitter
Share on whatsapp