యూఎస్‌లో ప్రీమియర్ షోలు మనకంటే ముందే ప్రారంభమవుతాయి. సైరా చూసిన యూఎస్ ప్రేక్షకులు పర్వాలేదు, బానేవుంది అని అంటున్నారు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం ఈరోజు తెల్లవారుజాము నుంచే యునైటెడ్ స్టేట్స్‌లో షోలు మొదలయ్యాయి. మూవీ చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా రివ్యూలు పెడుతున్నారు. మన, బాలీవుడ్‌లో మంగళవారం రాత్రే జర్నలిస్టులకు స్పెషల్ షో వేశారు. జర్నలిస్టులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. వోవరాల్‌గా ‘సైరా’పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రామ్ చరణ్ తన తండ్రికి ఈ సినిమాతో జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ షోలకు టిక్కెట్లు బాగానే అమ్ముడుపోయాయి. ప్రీమియర్లతో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్ రావడం ఖాయం అంటున్నారు. కాకపోతే, గత సినిమాలతో పోల్చితే సైరా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు.
యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్
సైరా (9:50PM PST) $754K
అరవింద సమేత $798K
సాహో $850K
భరత్ అను నేను $850K
స్పైడర్ $1.03Million