‘సైరా’ టైటిల్ సాంగ్ ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, అమిత్ త్రివేది స్వరాలతో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ పాడిన ఈ సాంగ్ ను యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షిస్తున్నారు. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి ‘U/A’ సరిఫికెట్‌ను ఇచ్చినట్లు ట్విటర్ వేదికగా తెలియజేశారు. హై యాక్షన్ మూవీగా బిగ్ స్క్రీన్ పై ఉత్కంఠ రేపుతుందని మూవీ యూనిట్ అంటోంది.
బ్రిటీష్ వారిని ఎదురించిన రాయలసీమ పాలెగాడు, తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గడించిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సైరా’ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. చిరంజీవికి జోడీగా నయనతార నటించగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతిబాబు, అనుష్క తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.