సైరా మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కీలకం. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లుగా టీమ్ అంతా ఎంతో శ్రమిస్తూ భారీ బడ్జెట్ పెట్టి అద్భుతమైన చిత్రంగా మలచేందుకు కృషి చేశారు.
కర్నూలులో 21న సైరా ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత గడ్డపై ప్రచారం మొదలెట్టి హైదరాబాద్, విశాఖపట్నంలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ హైదరాబాద్ రావచ్చని అంటున్నారు.
సైరా మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లో ఎంతో క్రేజ్ పెరిగింది. మెగా రేంజ్లో సైరా మూవీ బిజినెస్ కూడా సాగుతుందా..? లేదా..? ఇది ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
ఇటీవల గోదావరి జిల్లా హక్కులు 19 కోట్లకు బిజినెస్ అయినట్టు ప్రచారం జరిగింది. తర్వాత మిగతా ఏరియాల మార్కెట్ ట్రెండ్ ఏమిటో ఇంతవరకు ఎలాంటి టాక్ రాలేదు. ముంబై మార్కెట్‌లో డిమాండ్ ఎలా వుంటుందన్న టెన్షన్ ఉంది. సాహో మాదిరిగానే సైరా మూవీకి కూడా ఫ్యాన్సీ రేట్లతో కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ముందుకు వస్తారా..? లేదా..? వేచి చూడాల్సిందే.