ప్రస్తుతం ఎటుచూసినా సైరా మూవీ ఫీవర్. ఆ సినిమా విశేషాలపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. గతంలో బాహుబలి గురించి సినీ ప్రియులు కథలు కథలుగా చెప్పుకున్నారు. అదేరీతిలో ఇప్పుడు సైరాపై ఎంతో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రాల్లో సైరా నరసింహారెడ్డి ఒకటిగా ఇప్పటికే ఒక రికార్డ్. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలవుతున్న సైరా మేకింగ్‌లో వి.ఎఫ్.ఎక్స్ చాలా కీలకం. విఎఫ్‌ఎక్స్ కోసం సుమారు నలభై ఐదు కోట్లు ఖర్చుపెట్టారని టాక్.
బాహుబలికి మించి సైరాలో వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ అధికంగా వాడినట్లు సమాచారం. దర్శక ధీర రాజమౌళి కూడా దీన్ని దృవీకరించారు. బాహుబలి మూవీకి 2300 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ మాత్రమే వాడారు. సైరాకు 3800 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించినట్లు చెబుతున్నారు. సైరాలో 1500 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ అధికంగా ఉపయోగించారట. అన్ని వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను ఉపయోగించడం ఓ డైరెక్టర్ కి ఎంత కష్టమో తనకు తెలుసునని రాజమౌళి చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డి వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ అధికంగా ఉపయోగించడానికి పడిన కష్టం బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించడంలో కష్టం అంటే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వాటిని స్క్రీన్ ప్లే మేజిక్ చేసేలా చూపగలగాలి. వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించడం చేతకాక పొతే ఆకర్షణకు బదులు వికర్షణ ఎఫెక్ట్ కలుగుతుంది. గతంలో కొన్ని భారీ వి.ఎఫ్.ఎక్స్ మూవీల విషయంలో ఇది ఒక గుణపాఠం. అనగనగా ఒక ధీరుడు, దేవీపుత్రుడు, అంజి, మృగరాజు, రోబో 2.0 తదితర మూవీలు గ్రాఫిక్స్ ఉన్నా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి.