సైరా నరసింహారెడ్డి.. టైటిల్లో వున్న వైబ్రేషన్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో లేవు. అసలు ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటో క్లారిటీ లేదు.
దాదాపు రూ.350 నుంచి 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గాంధీ జయంతి నాడు విడుదలకు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకోవడం, అలాగే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం మెగా ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడెప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా అనే ఆశ ఉంది. ఇలాంటి సమయంలోనే మొన్నటి ప్రభాస్ తాజా చిత్రం సాహో విడుదలకి ముందు జరిగిన భారీ ప్రమోషన్స్‌ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వరల్డ్ సాహో డేగా ప్రకటించి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి తన సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడంలో ప్రభాస్ తన ఫ్యాన్స్ అందరికీ కిక్ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇటీవలి తన చిత్రం డియర్ కామ్రేడ్ కోసం సౌత్ ఇండియాలోనే అన్ని స్టేట్స్ తిరిగి మ్యూజిక్ ఫెస్టివల్ కూడా చేసి ప్రమోట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు సైరాకి ప్రమోషనే సరిగ్గా లేదు.
సాహో మూవీ నేషనల్ ప్రమోషన్స్ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. బాహుబలి ప్రమోషన్‌లో పార్టు టూ కంటే పార్టు వన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. బాహుబలి పార్టు వన్ కోసం రూ.15 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతారు.
ప్యాన్ ఇండియా చిత్రం, మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్, నాలుగు భాషల్లో విడుదల కావడం, భారీ బడ్జెట్టుతో తెరకెక్కిన చిత్రం.. ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిన సైరా మూవీ.. ప్రమోషన్స్ మాత్రం తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఒక భారీ ఈవెంట్ చేస్తే.. వరుణుడిచ్చి ఈ ఈవెంట్‌ని ఫ్లాప్ చేశాడు. ఇక హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో అయితే ఉలుకూ పలుకు లేదు. మరి వారంరోజుల సమయం మాత్రమే రిలీజ్‌కి సమయం వుంది. ఈ వీకెండ్ నుంచి అయినా చిత్ర ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుతారో లేదో చూడాలి.