మెగాస్టార్ స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్ అదిరిపోయింది. మెగా ఫాన్స్ పండగ చేసుకునే రీతిలో అక్టోబర్ 2న భారీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అంతా ఒకటే టెన్షన్. బిగ్ స్క్రీన్‌పై చిరు వీర విహారం చేసిన దృశ్యాలు టీజర్‌లో ఒక రేంజ్‌లో ఉన్నాయి. భారీ యుద్ధ విన్యాసాలు, గుర్రాలపై చిరు యాక్షన్ సీన్స్… థ్రిల్స్.. ఫైట్స్ ఔరా అనిపిస్తున్నాయి. ఫిరంగుల మోత… రౌద్ర రసం.. రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఆంగ్లేయుల్ని సైరా నరసింహారెడ్డి ఎదుర్కొంటున్న దృశ్యాలు అదరహో అనిపిస్తున్నాయి. చరిత్ర స్మరించుకుంటే ఝాన్సీ లక్ష్మీ భాయి, చంద్రశేఖర ఆజాద్, భగత్సింగ్ వంటి ఎందరో మహా వీరుల త్యాగాలు స్మరణకు వస్తాయి. ఆనాటి చరిత్రలో కనుమరుగయ్యాడు…రేనాటి సూర్యుడు…సైరా నరసింహారెడ్డి…అంటూ టీజర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన వాయిస్ కాస్త డల్‌గా వుంది.
రేనాటి వీరులారా.. చరిత్రలో మనం ఉండక పోవచ్చు…కానీ ఈ చరిత్ర మనతోనే మొదలవ్వాలి…అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలెట్. స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటష్ వారిపై పోరాడిన యోధుడు సైరా నరసింహారెడ్డి నిజ జీవిత చరిత్రను కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్‌పై మనకు అందిస్తున్నారు. రామ్ చరణ్ తేజ. భారీగా రూపొందించిన సైరా అందరితో ఔరా అనిపించడమే కాక మెగాస్టార్ సినీ జీవితంలో మరపురాని మహోన్నత చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ పండితులంటున్నారు. డైరెక్టర్ సురేందర్ టేకింగ్ చాలా రిచ్‌నెస్ తెచ్చింది. మెగా అభి మానులకు ఇది బిగ్ గిఫ్ట్. బాలీవుడ్‌లో మరో చరిత్ర సృష్టిసుందనే అంచనాలున్నాయి. టీజర్ వారేవా అనే రీతిలో దూసుకొచ్చింది.