సైరా సినిమా కోసం మెగా అభిమానులు వెయిటింగ్ ఇంతా అంతా కాదు. ఎప్పుడెప్పుడు అక్టోబర్ 2 వస్తుందా… రిలీజ్ షో చూద్దామా అని ఆత్రుతో ఉన్నారు. సైరా నర్సింహారెడ్డి సినిమా అంచనాలు కూడా రోజురోజుకు పెరుగుతుండటం పైగా ఉయ్యలవాడ వీరుని చరిత్రతో తెరకెక్కుతున్న సినిమా కావటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే, సినిమా ప్రమోషన్‌లో భాగంగా కృష్ణ జిల్లా గుడివాడ లో 80 అడుగుల మెగాస్టార్ కట్అవుట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. ఇక కటవుట్‌లు, బ్యానర్లకైతే లేక్కేలేదు.