సైరా డిజిటల్ హక్కులు రూ.40 కోట్లకు కొన్నారని వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక చిత్రంగా రాబోతున్న ఈ సైరా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంచనా. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అన్ని హంగులతో ఫాన్స్‌ని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ మూవీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. గోదావరి జిల్లాల హక్కులు గతంలోనే 19 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం వచ్చింది. ప్రస్తుతం సైరా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ రూ.40 కోట్లకు దక్కించుకుంది. దక్షిణ భారతదేశంలో ఇంత మొత్తానికి డిజిటల్ రేట్లు అమ్ముడవడం రికార్డ్. ఇక మొత్తం మూవీ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పది సీన్లే హైలైట్!
సైరా మూవీలో 10 యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే రీతిలో తీశారు. వాటిలో క్లయిమాక్స్‌కు ముందు వచ్చే యుద్ధం సీన్ ఓ వండర్ అని మూవీ బృందం చెబుతోంది. ఇక ఇంటర్వెల్ ముందు సీన్ అండర్ వాటర్‌లో ముంబై స్విమ్మింగ్ పూల్‌లో తీశారు. ఇది ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుందని అంటున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ మూవీ హిందీ డబ్బింగ్ ఇప్పటికే పూర్తయింది. మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొంటోంది.