మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజమౌళి, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవర్‌స్టార్ ప్రసంగం అన్నింటికంటే హైలైట్.
తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. ఇందులో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, రవి కిషన్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.