జక్కన్న ఫినిషింగ్ టచ్ ! - Tolivelugu

జక్కన్న ఫినిషింగ్ టచ్ !

‘సాహో’ ఎఫెక్ట్‌తో ‘సైరా’కు రీ ఆపరేషన్ జరుగుతోందా? అది కూడా దర్శకధీర రాజమౌళి తరహా ట్రీట్‌మెంట్ కోసం చెర్రీ వర్రీ అవుతున్నాడా? ‘ఉయ్యాలవాడ’లో నరసింహారెడ్డికి ఏం జరుగుతోంది?

టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల జోరు కొనసాగుతోంది. బడ్జెట్ పెట్టడమయితే ఓకే కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయంలోనే దర్శకులు తడబడుతున్నారని స్పష్టంగా తెల్సిపోతోంది. తాజాగా సాహో విషయంలోనూ సుజీత్‌ది అదే పరిస్థితి. పెట్టిన భారీ బడ్జెట్‌ను తిరిగి రాబట్టుకున్న ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే ఏమో..! దాదాపుగా ఒకదాని వెంట మరొకటిగా నడిచిన భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాలు ప్రభాస్ “సాహో” అండ్ మెగాస్టార్ చిరు “సైరా”. సాహో విడుదలై బాల్చీ తన్నేసింది. బ్యాడ్ టాక్ మూటకట్టుకుంది. కనీవినీ ఎరుగనంత నెగటీవ్ క్యాంపెయిన్ నడిచింది. అదృష్టం బాగుండి విడుదలైనపుడు నాలుగు వరుస సెలవులు రావడంతో కంప్లీట్ సేఫ్ కాకపోయినా మరీ అంత దిమ్మ తిరిగే లాసెస్ అయితే రావనే అనుకోవచ్చు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి, నయనతార కాంబినేషన్లో నిర్మిస్తున్న చారిత్రక చిత్రం “సైరా” దాదాపుగా విడుదలకు సిద్ధమైపోయింది.
దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం అండ్ కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే ఆయా భాషలకు చెందిన ప్రముఖ స్టార్స్ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతిలను ముఖ్య పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్లో సైతం పవన్ కల్యాణ్‌తో తెలుగులో, మోహన్‌లాల్‌తో మలయాళం వెర్షన్లో వాయిస్ చెప్పించారు. అయినా ఇప్పుడు సాహో దెబ్బ చూశాక  చెర్రీ, చిరులకు దడ మొదలయినట్టుంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రాక్ రికార్డుకు సైరా నిజంగా పెద్ద టాస్క్ కిందే లెక్క. అందుకే ఎందుకైనా మంచిదని సైరా సినిమా మొత్తాన్ని ఒకసారి రాజమౌళి చెక్ చేసి ఏవైనా మార్పులు, చేర్పులు సూచిస్తే అవి చక్కబెట్టుకున్న తర్వాతే ఫైనల్ కాపీ రెడీ చెయ్యాలనేది చిరు ఆలోచనట. ఈ విషయమై ఇప్పటికే రామ్‌చరణ్‌తో జక్కన్నకు కబురు పంపించాడని, రాజమౌళి కూడా ఆ పని టేకప్ చేశాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం జక్కన్న RRR మూవీ షూటింగ్ కోసం విదేశాల్లో వున్నాడు. మరి అక్కడే ఈ ప్రాజెక్ట్ చేపడతారా? ఇండియాకి తిరిగొచ్చాక చేస్తారా? అసలీ టాక్ వెనుక ట్రూత్ ఎంతుంది? త్వరలోనే తెలుస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp