గుంటూరు: మెగా చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అదనపు ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ భారీ చిత్రానికి అదనపు ప్రధర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి అంగీకారం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు అంటే మొత్తం 7 రోజులూ ఈ సినిమాను ఉదయం గం. 1 నుంచి ఉదయం గం. 10 వరకు అదనపు షోలు ప్రదర్శించుకోవడానికి వీలుగా ప్రభుత్వం అనుమతిని జారీచేసింది. దీనిపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది.