బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బరాబర్ సచివాలయ డోమ్‌లను కూల్చివేస్తామని ఆయన మరోసారి అన్నారు. పాత బస్తీ నుంచి మొదలు యావత్ తెలంగాణ మొత్తం తమదేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందువుల దమ్ము చూపించే రోజు వచ్చిందన్నారు.
di
కార్వాన్ లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మజ్లిస్‌ను తరిమికొడతామన్నారు. హిందూ యువకులు తనకు 8 నెలల పాటు సమయం కేటాయిస్తే రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత తనదని వెల్లడించారు.
భాగ్యనగర్ ప్రజలంతా మజ్లిస్ సవాల్‌ను స్వీకరించి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మజ్లిస్ నేత ఒవైసీ కండ్లలో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్ కలశం, మామిడి తోరణాలతో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త భవనం పేరుతో డోమ్‌లను నిర్మించారని ఆయన ఆరోపించారు.
12 శాతం ఓట్లున్న పార్టీ రాష్ట్రంలో 7 సీట్లు గెలిస్తే.. 80 శాతం ఓట్లున్న హిందువులు ఎన్ని సీట్లు గెలవాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ముస్లింలు, క్రైస్తవులను తాను ఎన్నడూ కించపర్చలేదన్నారు. కానీ 15 నిమిషాల సమయమిస్తే హిందువులను నరికి చంపుతామన్నారని, ఆ వ్యాఖ్యలు చేసిన వారి వీపు సాఫ్ చేయాలని ఆయన ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ ఔరంగజేబ్ ఆస్థానంలోని రాజా మాన్ సింగ్ తో ఆయన పోల్చారు. భాగ్యనగరంలో తప్పా మరో చోట మజ్లిస్ పోటీ చేయడంలేదన్నారు. హిందువులకు చేతకావడం లేదంటూ సవాల్ చేస్తూ మరీ పాతబస్తీలో పోటీ చేసి గెలుస్తున్నారన్నారు. భాగ్యనగర్ హిందువులు ఎంఐఎం నేతల సవాల్‌ను చాలెంజ్‌గా స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ను ఓడించి సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ నేతలకు దమ్ముంటే 119 స్థానాల్లో పోటీచేయాలని ఆయన సవాల్ విసిరారు. వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కుకుండా చేస్తామన్నారు.
ఎంఐఎం నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చంకలో వేసుకుని వచ్చినా తాము రెడీగా ఉన్నామన్నారు. బీజేపీ మాత్రం సింగిల్‌గా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పాతబస్తీకి రావాలంటే తన అనుమతి తీసుకోవాలంటూ ఒవైసీ సవాల్ చేస్తే అన్నీ మూసుకుని ఫాంహౌజ్‌లో పడుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కానీ తాను మోడీ వారసుడిగా వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద సభ నిర్వహించి హిందువుల తెగువ చూపించానన్నారు.