శేరిలింగంపల్లి నియోజవర్గంలో గౌలిదొడ్డిలో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం సుమారు 250 మంది వడ్డెర కుటుంబాల గుడిసెలను కూల్చివేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి బాధితులను పరామర్శించారు. అవే గుడిసెలలో గత 30 ఏళ్లగా ఉంటున్న వారికి నివాసం లేకుండా చేయడం దారుణమని ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయం జరగని పక్షంలో బాధితుల తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని కాంగ్రెస్ నేతలు భరోసా ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాధిత ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చామని అన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి సహా పలువురు నేతలు బాధితులను పరామర్శించారు.