తమిళనాడులో త్రి భాషా సూత్రాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తేల్చి చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలో త్రి భాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడం బాధకరమన్నారు. తాము దశబ్దాలుగా ద్వి భాషా సూత్రాన్ని అమలుపరుస్తున్నామన్న పళని.. అందులో ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేశారు.
త్రి భాషా విధానంపై కేంద్రం పునరాలోచించుకోవాలని పళనిస్వామి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలు ఏకగ్రీవంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని.. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కోరారు.