తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా సైరా సినిమా అన్నారు ఎంపీ సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు అయితే, సైరా సినిమా ఒక ఎత్తు అని ఆయన అభినందించారు. సైరా ఆత్మీయసత్కార సభలో మాట్లాడుతూ… స్వతంత్ర సమరయోధుడు నర్సింహారెడ్డి జీవిత చరిత్ర తో చిరంజీవి తీసిన సైరా సినిమా భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఇలాంటి కథలను ఎంచుకుని సాహసం చేసి విజయం సాధించటం మాములు విషయం కాదని, రాంచరణ్ లాంటి కుర్రాడు ఇంత పెద్ద సినిమాకి నిర్మాతగా వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇద్దరం పక్క పక్కనే ఉండేవాళ్లమని, తనతో ఉన్న బంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి,తమన్నా,రాంచరణ్,చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి,మురళీమోహన్,దిల్ రాజు, బ్రహ్మాజీ, హీరో రాజశేఖర్ పాల్గొన్నారు.