గ్లామర్ గార్ల్ తాప్సి… బాలీవుడ్‌కు వెళ్లాక వివాదాలు తనకు అలవాటై పోయాయి. అయితే, సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచే తాప్సీ ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా తాప్సి ఆన్ ఫైర్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది.
అసలు విషయం ఏంటంటే… ఇటీవల ఓ మీటింగ్ అటెండ్ అయ్యేందుకు గోవాకు వెళ్లింది తాప్సీ. ఆ సభలో తను ప్రసంగిస్తున్న సమయంలో… మీరు హింది హీరోయిన్ కదా, హిందిలో మాట్లాడవచ్చు కదా అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు. దాంతో… అంతేస్థాయిలో రిప్లై ఇచ్చిన తాప్సీ, హిందిలో మాట్లాడుతూ… ఈ సెషన్ మొత్తం నేను హిందీలో మాట్లాడగలను. కానీ ఇక్కడున్నందరికీ హింది అర్థమవుతుందా… ? అని ప్రశ్నించింది.
అంతేకాదు… నేను కేవలం హిందిలో మాత్రమే కాదు సౌత్ ఇండియన్ భాషలలో కూడా నటించాను. అలాగని ఇప్పుడు తమిళ్, తెలుగులో కూడా మాట్లాడమంటారా అని ప్రశ్నించింది. దీంతో ఆ తర్వాత ఒక్కరు కూడా తన ప్రసంగానికి అడ్డుతగల్లేదు.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది. తాప్సీ ఆన్ ఫైర్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.