నటి తాప్సీ…బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఘాటు విమర్శలు చేసింది. ఆమెపై నాకు ఎలాంటి శతృత్వమూ లేదంటూనే స్ట్రాంగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది తాప్సీ. ‘ఆమె ఎప్పుడు ఎదురైనా పలకరించడానికి వెనుకాడను. కంగనా సోదరి రంగోలి చందేల్ నన్ను ‘బి-గ్రేడ్’ అంటే.. కంగన కూడా ‘చీప్’ అని పిలిచింది. అయినా దాని గురించి నేనేం బాధపడలేదు.
నిజం చెప్పాలంటే వాటి అర్థాలు నాకు తెలియదు. నేను ఇప్పుడు పరిశ్రమలో ఉన్నాను కాబట్టి అతిథులను పలకరించడం, హలో, ధన్యవాదాలు చెప్పడం కామన్‌గా తీసుకుంటా. ఆమె కనిపిస్తే దూరంగా వెళ్లను.
ఎందుకంటే నాకు ఆమెతో సమస్య లేదు. కానీ, ఆమెనే ఒక సమస్యగా మారింది. ఆమె కోరికలు చూసి మొదట ఆశ్చర్యపోయాను.
నన్ను చౌక అని పిలిచినప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. ఎందుకుంటే ఆమె గొప్ప నటి. అందుకే దాన్ని ఒక అభినందనగా తీసుకున్నా’ అని తాప్సీ వివరించింది.