మంచు మనోజ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది తాప్సీ. ఆ తరువాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా రాణించలేక పోయింది. దీంతో బాలీవుడ్ వైపు తాప్సీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం తాప్సీకి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చిందట. షారుక్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ తాప్సీకి వచ్చినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో షారుక్ హీరోగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా పేరు చర్చకు వచ్చిందట.