బాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే పేరున్న హీరోయిన్ తాప్సితో పాటు దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇంటిపై మూడు రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయి. ఈ ఐటీ రైడ్స్ పై ఫైనల్ గా తాప్సి పెదవి విప్పింది. తనపై ప్రధానం రెండు ఆరోపణలు చేస్తున్నారని… పారిస్ లో ఉన్న బంగ్లాతో పాటు ఐదు కోట్లకు సంబంధించిన రశీదుపై ప్రధానంగా ఫోకస్ చేశారని పేర్కొంది. తమకు ఈ ఆస్తులపై ఆధారాలున్నట్లు ఐటీ అధికారులు చెప్పారని కానీ వారితో నేను విభేదిస్తున్నట్లు ప్రకటించింది.
తనదేనని ఆరోపిస్తున్న పారిస్ బంగ్లా ఇంటి తాళాలు ఎక్కడని ప్రశ్నించటంతో పాటు 5కోట్ల రశీదుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు తెలిపింది. ఈసందర్భంగా 2013 సంవత్సరంలో తనపై జరిగిన ఐటీ రైడ్స్ పై కూడా ప్రశ్నించినట్లు పేర్కొంది.
అయితే, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని రుజువయ్యేందుకు కొంతకాలం ఆగాల్సి ఉంటుందని తాప్సి ప్రకటించింది.