టబు… తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. విక్టరీ వెంకటేష్ జోడి గా కూలి నెంబర్ 1 సినిమాతో తెలుగులో టబు ప్రస్థానం మొదలైంది. తరువాత నాగార్జునతో తీసిన నిన్నే పెళ్లాడతా సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎక్కువ సినిమాలు లేకపోయినప్పటికీ ఈ అమ్మడుకు క్రేజ్ బాగానే ఉంది. తెలుగులో కంటే టబు ఎక్కువగ బాలీవుడ్ లో సినిమాలు తీసింది.
చాలా సంవత్సరాల తర్వాత తెలుగు లో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మళ్ళీ తెలుగులో టబు కనిపించలేదు. ఇప్పుడు తాజాగా అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న’అలవైకుంఠపురం లో’ సినిమా లో టబు ఓ కీలకపాత్ర పోషిస్తుంది. తెలుగు, హిందీ సినిమాలతో ప్రేక్షకులను మనసులు గెలుచుకున్న ఈ బామ నేడు 48 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది.