ఎమ్మార్వో వనజాక్షి అనగానే గతంలో జరిగిన సంఘటలను గుర్తుకొస్తాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుక విషయంలో జరిగిన దాడి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంచలనమై, వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆ అంశాన్ని వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా హాడావిడి చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వో వనజాక్షి విజయవాడ రూరల్ మండల పరిధిలోని కె.తాడేపల్లిలో రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పేదల హౌజింగ్ కోసమంటూ భూసేకరణ కోసం వచ్చిన ఎమ్మార్వో వనజాక్షి.. అక్కడ భూమి ఇవ్వమని ఆందోళన చేస్తున్న రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటూ కామెంట్ చేసింది.
దీంతో… రైతులను బ్రోకర్స్ అంటారా అంటూ పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో… అక్కడి నుండి వనజాక్షి వెళ్లిపోయింది. ఎమ్మార్వో చేసిన వ్యాఖ్యలపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.