జగన్ సర్కారుతో పోరాడి… ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం చేసి గెలిచి వచ్చిన మున్సిపల్ ఎన్నికల హీరో జేసీ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా జేసీ మాత్రం తాడిపత్రిలో తన పట్టు ఏంటో చూపించాడు. మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. గెలిచాక జగన్ ను పొగిడి వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా ఓటర్లపై చిందులు తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతుంది.
తాడిపత్రిలోని స్థానిక ప్రజలు మాకు రోడ్డేయ్యాలని, ఇబ్బందిగా ఉందని జేసీని కోరగా.. ఆయన తనదైన శైలీలో ప్రజలపై విరుచకపడ్డారు. ఇప్పుడు పనులు అడుగుతారా….నా కొడకల్లారా… మీకు అలా అడిగే హక్కు లేదు… మీరు డబ్బు తీసుకోకుండా ఓటు వేసి ఉంటే నేను మీకు పనులు చేయాలి అంటూ ఫైర్ అయ్యారు. నీతి నిజాయితీగా ఓటు వేసినప్పుడే నిలదీసే హక్కు ఉంటుందని, డబ్బులకు ఓటు అమ్ముకుంటే నాయకులకు నిలదీసే హక్కు లేదని…. ప్రశ్నించే ఆ హక్కును కోల్పోతామన్నారు. డబ్బు తీసుకోకుండా ఓటు వేసిన రోజు నాయకుడి కాలర్ పట్టుకుని మా పనులు చేయమని అడిగే హక్కు ఉంటుందని జేసీ స్పష్టం చేశారు.