ఊహించని పరిణామానికి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది హడలిపోయారు. తన 12 గుంటల భూమిని పట్టా చేయకపోతే చంపేస్తానంటూ ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసుకొని ఏకంగా తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచచారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే… రమణ తండాకు చెందిన చాందావత్ వాల్యాకు 12 గుంటల భూమి ఉంది.ఆ భూమికి పట్టా చేయాల్సిందిగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. నేరుగా తహశీల్దార్ చాంబర్‌లోకి వెళ్లి ఆమెపై దుర్భాషలాడాడు. పట్టా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ.. చాందా వాల్యా భూమిని గతంలోనే పట్టా చేశామని.. కానీ అమ్ముకున్న 12 గుంటల భూమిని కూడా పట్టా చేయాలని అతను కోరుతున్నాడని చెప్పారు.అది అక్రమం కాబట్టే పట్టా చేయట్లేదన్నారు.