ఆగ్రాలోని తాజ్ మహల్‌కు వద్ద కలకలం రేగింది. కట్టడం పరిసర ప్రాంతాల్లో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు తాత్కాలికంగా తాజ్ మహల్‌ను మూసివేశారు. తాజ్ మహల్ రెండు ద్వారాలను మూసివేసి..తనిఖీలు చేపట్టారు. CISFతో పాటు స్థానిక పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్‌తో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడకు వచ్చిన సందర్శకులను బయటకు పంపించేశారు.
ఉదయం గుర్తు తెలియని వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి తాజ్ మహల్ లో బాంబు ఉంచినట్లు బెదిరింపు కాల్ చేసాడు. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు.. ఎవరు ఫోన్ చేశారు.. ఎక్కడి నుంచి చేసారన్న దానిపై ఆరా తీస్తున్నారు.