ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పలు దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవం సందర్బంగా మహాత్మగాంధీని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆరోగ్యకరమైన శైలికోసం అందరూ గాంధీ మహత్మడి నుంచి ప్రేరణ పొందాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ లో మహత్మగాంధీ సైకిల్ పై వెళుతున్న ఫోటోను అప్ లోడ్ చేశారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ అనే కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం సైకిల్ విశిష్టతను పేర్కొంటూ ట్వీట్ చేశారు. సైకిల్ తొక్కడమనేది పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మంచిదంటూ ఆయన అన్నారు. వయనాడ్ లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు సైకిల్ రైడింగ్ చేసే వీడియోను ఆయన షేర్ చేశారు.