బెజవాడలో జలీల్‌ఖాన్ మాదిరి హైదరాబాద్‌లో తలసాని సాయికిరణ్. గోదావరి ఏపీ నుంచి తెలంగాణా వైపు ప్రవహిస్తోందని యూట్యూబర్ ఇంటర్వ్యూలో చెప్పి జలీల్‌ఖాన్ క్రియేట్ చేసిన హిస్టరీని తిరగరాశాడు. ఇప్పుడు ఈ సాయికిరణ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
హైదరాబాద్ : మొన్నటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రాత్రికి రాత్రే కేటీఆర్ బొమ్మలతో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లని తన ఫాలోవర్స్‌తో తలసాని సాయికిరణ్ అంటించిన పోస్టర్లని సిటిజెన్లు, నెటిజెన్లు ఫైరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడే ఈ తలసాని సాయికిరణ్. అంత పెద్దమనిషి చట్టాన్ని ఉల్లంఘించాడని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. సాయికిరణ్‌కు ఫైన్ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో తలసాని సాయికిరణ్‌కు చేసిన తప్పు తెలిసొచ్చింది. నెటిజెన్ల ఆగ్రహాన్ని చల్లార్చాలనుకుని ట్విట్టర్‌లో బదులిచ్చారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. పోస్టర్లు వేసినందుకు క్షమాపణ కోరాడు. పెనాల్టీ కూడా చెల్లిస్తానని మాటిచ్చాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఈ తలసాని సాయికిరణ్ అంటూ మళ్లీ నెటిజెన్లు కామెంట్లు విసిరారు. మొత్తం మీద తండ్రికి మించిన లీడర్ అయ్యే లక్షణాలు బాగా కనిపిస్తున్నాయని పరిశీలకుల మాట.