హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్లో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.అయితే..దవాఖానాకు వెళ్లే దారిని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మూసివేశారు.దీంతో రైల్వే అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తలసాని.ప్రజలు వినియోగిస్తున్నరహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సనత్ నగర్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు.మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్,పోలీసు అధికారులను ఆదేశించారు.ఇంత జరుగుతున్నా స్థానిక బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.రైల్వే అధికారులు బస్తీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలని మంత్రి తలసాని హెచ్చరించారు.