తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. ముల్లా మహమ్మద్ హసన్ ప్రధానిగా తాత్కాలిక గవర్నమెంట్ ను ప్రకటించారు. పలు శాఖలను లీడ్ చేసే మంత్రుల వివరాలను తాలిబన్ ప్రతినిధి ముజాహిద్ వివరించాడు.
కొత్త ప్రభుత్వంలో ప్రతీ మంత్రికి ఇద్దరు సహాయమంత్రులు ఉండనున్నారు. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీ విషయంలో తాలిబన్లు, హక్కానీ గ్రూప్ మధ్య విభేధాలు తలెత్తినా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నడిపి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని- ముల్లా మహమ్మద్ హసన్
డిప్యూటీ ప్రధాని- ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
డిప్యూటీ ప్రధాని- మౌల్వీ హనాఫీ
విదేశాంగ మంత్రి- అమీర్ ఖాన్ ముత్తాకీ
రక్షణ మంత్రి- ముల్లా యాకూబ్
ఆర్థిక మంత్రి- క్వారీ దిన్ హనీఫ్
హజ్, మతపరమైన వ్యవహారాల మంత్రి- మౌలావి నూర్ మహమ్మద్ సాకిబ్
న్యాయ శాఖ మంత్రి- మౌలావి అబ్దుల్ హకీం షారీ
గనులు, పెట్రోలియం శాఖ మంత్రి- ముల్లా మహమ్మద్ ఎసా అఖుంద్
పౌర విమానయాన, రవాణా శాఖ మంత్రి- ముల్లా హమీదుల్లా అఖుంజాదా
ఉన్నత విద్యాశాఖ మంత్రి- అబ్దుల్ బాకీ హక్కానీ
టెలీకమ్యూనికేషన్ మంత్రి- నజీబుల్లా హక్కానీ
శరణార్థుల మంత్రి- రహ్మాన్ హక్కానీ
ఆర్మీ ఛీఫ్- ఖారీ ఫసిహుద్దీన్